ట్విస్టుల మీద ట్విస్టులు

0
144

హైదరాబాద్: సంచలనం సృష్టిస్తున్న అత్యాచార బాధితురాలి ఘటనలో ట్విస్టులు వెలగు చూస్తూనే ఉన్నాయి. డాలర్‌భాయ్‌ చేతిలో కీలు బొమ్మగా మారానని.. అతను బెదిరించడంతోనే అమాయకులపై సైతం కేసులు పెట్టానని మరీ మీడియా సమావేశంలో బాధితురాలు ప్రకటించింది. ఈ వ్యవహారానికి డాలర్‌భాయ్‌ అలియాస్‌ రాజశ్రీకర్‌ రెడ్డి కింగ్‌పిన్‌ అని భావిస్తున్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీఎస్‌ మహిళా పోలీస్‌స్టేషన్‌లో దర్యాప్తు కొనసాగుతోంది. అందులో చాలా మందికి ఈ వ్యవహారంతో సంబంధం లేదని బాధితురాలు చెప్పడంతో కేసులో మరో ట్విస్ట్. ఆమె చెప్పే వివరాల ఆధారంగా అమాయకుల పేర్ల తొలగింపు.. ఇతరత్రా చర్యలుండే అవకాశముంది. మరోవైపు డాలర్‌బాయ్‌ చిక్కితే ఈ కేసులో మరింత స్పష్టత వచ్చే అవకాశమున్నందున అతనికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఫిర్యాదు చేసిన నాటి నుంచి ఆగస్టు 29 వరకు డాలర్ బాయ్ అందుబాటులో ఉన్నప్పటికీ ఆ తర్వాత అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ జరుగుతున్న అన్ని విషయాలను డాలర్‌భాయ్‌ గమనిస్తున్నాడు. బాధితురాలి ప్రెస్‌మీట్‌తో సహా… మీడియా కథనాలను, ఆసక్తిగా పరిశీలిస్తున్నాడని సమాచారం.
అత్యాచార బాధితురాలి మీడియా సమావేశం తర్వాత డాలర్ బాయ్ మరో సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. అందులో మాస్కు పెట్టుకుని మాట్లాడిన డాలర్‌భాయ్‌ బాధితురాలి ఆరోపణలను ఖండించాడు. ఆమెను తాను బ్లాక్‌మెయిల్‌ చేశాడన్న ఆరోపణలను ఖండించాడు. ఆగస్టు 29న తానే ఆ యువతిని వారి తల్లిదండ్రులకు అప్పగించి రాతపూర్వకంగా సంతకాలు తీసుకున్నట్లు వివరించాడు. ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్న ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.

Leave a Reply