స్పా సెంటర్‌ మాటున

0
341

హైదరాబాద్‌ : నగరంలో మరోసారి హైటెక్‌ వ్యభిచారం వెలుగు చూసింది. స్పా సెంటర్‌ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న కేంద్రంపై కేపీహెచ్‌బీ పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమ దందాకు పాల్పడుతున్న ఏడుగురిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేపీహెచ్‌బీలోని రోడ్‌ నెంబర్‌–1లో కృష్ణ అపార్టుమెంట్‌ ఫ్లాట్‌ నెం. 302లో ఆర్‌ఏ స్పా అండ్‌ మసాజ్‌ సెంటర్‌ పేరిట దందా సాగుతోంది. అందులో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న విశ్వనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. నిర్వాహకులు అక్బర్‌అలీ, రాజ్‌కుమార్‌, శివ, అమర్‌, రాజేందర్‌, బాష, వేణులను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు యువతులను రక్షించిన పోలీసులు వారిని మహిళా సంక్షేమ కేంద్రానికి తరలించారు. నిర్వాహకుల నుంచి రూ.7వేల నగదుతో పాటు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దందా సాగిన ఫ్లాట్‌ను సీజ్‌ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

Leave a Reply