చర్లపల్లి జైల్లో  రిమాండ్ ఖైదీ మృతి

0
317హైదరాబాద్:
చర్లపల్లి సెంట్రల్ జైల్ లో రిమాండ్ ఖైదీ  అనుమానాస్పద  స్థితిలో మృతి చెందాడు.  జైలులో శిక్ష  అనుభవిస్తున్న రవి నాయక్ (37) గుండెపోటుతో మృతి చెందాడని జైలు అధికారులు  చెబుతున్నారు.  అయితే పోలీసులు కొట్టిన దెబ్బలకే మరణించాడని  కుటుంబ సభ్యులు  ఆరోపిస్తున్నారు.  ఈ మేరకు కుటుంబ సభ్యులు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు  చేశారు.  స్నాచింగ్ కేసుల్లో  నిందితుడిగా ఉన్న రవి రెండున్నర నెలల  క్రితం పి.డి యాక్ట్  కింద శంషాబాద్ పోలీస్ స్టేషన్ నుండి   జైలుకు  వచ్చాడు. రవి స్వగ్రామం బుద్ధారం గ్రామం,  అనువాడ మండలం మహబూబ్నగర్ జిల్లా. మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కి తరలించారు.

Leave a Reply