…
హైదరాబాద్: పరోపకారం, తోటి మానవులకు సాయం చేయడంలో ముందుండే సైఫాబాద్ పోలీస్ స్టేషన్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాజు నాయక్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. కరోనా కష్టకాలంలో తన ఊరి ప్రజలతో పాటు నిరాశ్రయురాలైన ఓ వృద్ధురాలికి ఆధారం కల్పించారు. ఆమె ను అన్ని విధాలా ఆదుకుని మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. డ్రెస్ హైదరాబాద్ ఖైరతాబాద్ నాల పక్కనే చిన్న ఇంట్లో నివాసం ఉండే వృద్ధురాలు యాదమ్మ ఇళ్లు భారివర్షాలకు పూర్తిగా కూలి పోయింది. గోడ,రేకులు బాగా దెబ్బ తిన్నాయి. పోలీస్ కానిస్టేబుళ్ల ద్వారా సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ రాజు నాయక్ వెంటనే.. అక్కడికి చేరుకున్నారు. వృద్ధురాలికి అవసరమైన దుస్తులు, ఆహారం ఇప్పించి వృద్ధాశ్రమంలో చేర్పించారు. అంతేకాకుండా మనసు తృప్తి చెందక.. ఆమెకు ఎలాగైనా మళ్ళీ ఆధారం కల్పించాలని నిశ్చయించుకున్నారు. వెంటనే తన మిత్రుడిని సంప్రదించి..మరో ఇద్దరు ఎస్సై ల సహాయంతో గోడ, రేకులు కూలిపోయిన ఆ వృద్ధురాలి ఇంటిని తిరిగి నిర్మించి, ఆమెకు కావాల్సిన బెడ్, పరుపు, 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకుల సమకూర్చారు. సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్ రెడ్డి చేతుల మీదుగా.. ఈ రోజు ఆ వృద్ధురాలు తిరిగి తన ఇంట్లోకి ప్రవేశించే ఏర్పాటు చేశారు. దీంతో ఆ వృద్ధురాలు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మానవత్వంతో వృద్ధురాలికి ఆధారం కల్పించి అత్యవసర సరుకులు శానిటైజర్ లు అందజేశారు. వృద్ధురాలికి సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్న డి ఐ రాజు నాయక్ ని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.
