ఎస్‌ఐ, జర్నలిస్టు ఏకమై 26 లక్షలు దోచేశారు.!

0
217

బెంగళూరు : చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు అధికారి, సామాజాన్ని చక్కదిద్దాల్సిన జర్నలిస్టు తప్పుదారి పట్టారు. ఓ ముఠాతో చెయ్యి కలిపి వ్యక్తి నుంచి ఏకంగా 26.5 లక్షలు కొట్టేశారు. పోలీసుల విచారణలో నిజాలు నిగ్గు తేలడంతో ఊచలు లెక్కిస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగుళూర్‌లోని చిక్కపేటలో జరిగిన ఈ ఘటన వివరాలివి… ఆగస్టు 19న ఉదయం శివ కుమారస్వామి అనే వ్యక్తి 26.5 లక్షల నగదును తీసుకువస్తున్నట్లు అతడి స్నేహితుడి ద్వారా ఓ దొంగల ముఠాకు తెలిసింది. కుమారస్వామి చిక్కపేట మెట్రో స్టేషన్ సమీపానికి రాగానే ముగ్గురు అతడిని అడ్డగించి మొబైల్ ఫోన్‌ లాక్కొని కారులో అపహరించారు.

యూనిటీ భవనానికి తీసుకెళ్లి అతడి వద్ద ఉన్న డబ్బును దోచుకున్నారు. తరువాత బాగ్ సమీపంలోని హోటల్‌కు తీసుకెళ్లి హెచ్చరించి వదిలివేశారు. బాధితుడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అపహరణ, అక్రమ నిర్బంధ, బెదిరింపు, దోపిడీ, కుట్ర కేసులు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దర్యాప్తులో ఇన్స్పెక్టర్ జీవన్ కుమార్ థామస్ (31), అతని సహచరులతోపాటు కన్నడ వార్తాపత్రిక రిపోర్టర్‌గా చెప్పుకునే జ్ఞానప్రకాష్ ఆంథోనప్ప(44) ఓ ముఠాతో దోపిడీకి కుట్ర చేశారని వెల్లడవడంతో ఇద్దరిని అరెస్టు చేశారు. కేసులో ప్రమేయం ఉన్న మరికొంత మంది నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Leave a Reply