భీమిలి బీచ్ లో అస్థి పంజరం

0
253

విశాఖ: భీమిలి బీచ్ లో గుర్తు తెలియని మృత దేహం లభ్యమైంది. బీచ్ రోడ్డు జగ్గారావు తోట దగ్గరలో మృతదేహం తీరానికి చేరింది.
కేవలం స్కెలిటిన్ మాత్రమే ఉన్న మృత దేహం నీటిలో తేలియాడుతుండటం గమనించిన స్థానికులు మృత దేహాన్ని ఒడ్డుకు చేర్చి, పోలీసులకు సమాచారం అందించారు. …. మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్న భీమిలి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మృత దేహం పూర్తిగా కుళ్ళిపోయి, కేవలం అస్థిపంజరం మాత్రమే మిగిలి ఉందని, మెడలో మాస్కు, నడుంకి నల్లటి త్రాడు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మృత దేహం ఆడా,లేదా మగ. చనిపోయి ఎన్ని రోజులు అయ్యింది, హత్యా లేక ఆత్మహత్య అనే సందేహాలు పోస్ట్ మార్టంలో తేలాల్సి ఉంది.

Leave a Reply