భర్త తన మాట వినలేదని…

0
840
Suicide

హైదరాబాద్: భర్త తన మాట వినలేదని క్షణికావేశంతో ఓ మహిళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అంబర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గోల్నాక జైస్వాల్‌గార్డెన్‌లో నివాసం ఉండే రవిప్రసాద్‌, స్వప్న (39)లకు 2008లో పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లున్నారు. ఈ నెల 3వ తేదీ సోమవారం రవిప్రసాద్‌ రాఖీ పండగను పురస్కరించుకుని దిల్‌సుఖ్‌నగర్‌లోని తన కుటుంబ సభ్యుల దగ్గరకు తన కుమార్తెలతో కలిసి వెళ్లారు. వద్దని చెప్పినా భర్త వెళ్లాడని భార్యకు ఆగ్రహం వచ్చింది. భర్త ఇంటికి తిరిగా రాగా అక్కడే ఉండమని తిరిగి పంపించేసినట్లు సమాచారం. దీంతో స్వప్న తల్లి వచ్చి కూతురికి నచ్చచెప్పి వెళ్లిపోయింది. మరుసటి రోజు ఆమె తిరిగి తన కుమార్తె ఇంటికి రాగా తలుపు మూసిపెట్టి ఉండడం గమనించింది. కిటికిలో నుంచి చూడగా స్వప్న ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. దీంతో ఆమె సమాచారం తన అల్లుడికి తెలియజేసింది. వారు వచ్చి చూసేసరికి అప్పటికే స్వప్న మృతి చెందినట్లు గుర్తించారు. స్వప్న కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Leave a Reply