చంచల్ గూడ జైల్ లో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్న తీన్మార్ మల్లన్న

0
147

హైదరాబాద్: చంచల్ గూడ జైల్లో  రిమాండ్ లో ఉన్న క్యూ న్యూస్ నిర్మాత తీన్మార్ మల్లన్న  జైల్లోనే ఆమరణ నిరాహార దీక్ష  చేపట్టారు.   తనపై అక్రమ కేసులు బనాయించారని
నిరసనగా.. మంగళవారం సాయంత్రం నుంచి  ఆయన  జైల్లో ఆమరణ దీక్ష చేస్తున్నట్లు తెలిసింది.  ఈరోజు (బుధవారం) బెయిల్  మంజూరై తీన్మార్ మల్లన్న  విడుదల అవుతారని భావించినప్పటికీ… జగదేవ్ పూర్ లో తీన్మార్ మల్లన్నపై మరి కొన్ని అక్రమ కేసులు బనాయించినట్లుగా సమాచారం. దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీన్మార్ మల్లన్న అభిమానులు 
రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగుతున్నట్లు   తెలుస్తుంది.

Leave a Reply