మద్యం రవాణాదారుల ఎత్తుగడ
చిత్తు చేసిన నందిగామ పోలీసులు
ఎన్టీఆర్ జిల్లా: నందిగామ : మార్చ్ 17 నేరాలు-ఘోరాలు: మద్యం అక్రమార్కులు ఎంతో తెలివితేటలతో రోజుకో కొత్త ప్లాన్‌తో ముందుకు వస్తున్నారు. తాజాగా పల్సర్ బైక్ పెట్రోల్ టాంకును మద్యం అక్రమరవాణాకు ఉపయోగించారు. దానిలో పెట్రోలు తీసేసి 150 మద్యం సీసాలు దాచారు. కోదాడ నుంచి చాకచక్యంగా రవాణా చేస్తుండగా నందిగామ పోలీసులు పట్టుకున్నారు. టాంక్ ఓపెన్ చేసి వారి వద్ద నుండి 150 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని ఒకరిని అదుపులోకి తీసుకొని పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎసిపి రవికిరణ్ మాట్లాడుతూ పల్సర్ బైక్ రీ మోడల్ చేసుకుని మద్యం తరలిస్తున్న సమాచారంతో పల్సర్ బైక్ ను నందిగామ శివారులో అదుపులో తీసుకున్నామన్నారు. బైకుటాంకులో 150 తెలంగాణ మద్యం బాటిళ్లు చూసి పోలీసులే ఆశ్చర్య పోయారు. మద్యం బాటిళ్లతో పాటు బైక్ సీజ్ చేశామని ఆయన తెలిపారు చాకచక్యంగా మద్యం పట్టుకున్న సీఐ హనీష్ ను, ఎస్సై పండు దొర, పోలీస్ ఎస్సై దుర్గ మహేశ్వర రావు. పట్టుకున్న సిబ్బందిని ఏసీపీ అభినందించారు.