ప్రేయసి  మోజులో
భార్య, ఇద్దరు పిల్లల హత్య

0
304

లక్నో: ప్రేయసి మోజులో పడి యూపీలో భర్త దారుణానికి ఒడిగట్టాడు.  ప్రేయసి మోజులో,   తన వివాహేతర సంబంధానికి అడ్డుపడుతున్నారని భావించిన భర్త తన
భార్య, ఇద్దరు పిల్లలను  హత మార్చడమే కాకుండా  వారిని ఇంట్లోనే పాతిపెట్టాడు.  తెలివిగా కట్టుకున్న భార్య, తన ఇద్దరు పిల్లలతో కలిసి చెప్పకుండా ఎటో వెళ్లిపోయిందని పోలీసులకు ఫిర్యాదు  చేశాడు. అంతేకాకుండా  భర్త కూడా దారుణ హత్యకు గురైనట్టు పోలీసులకు సమాచారం అందింది.  నిజమని భావించిన పోలీసులు భార్యా పిల్లలను  వెదకడం తో పాటు భర్త  ఆనవాళ్లపై దర్యాప్తు చేశారు.
ఇదంతా జరిగిన రెండేళ్ల తర్వాత కేసులో పోలీసులకు దిమ్మతిరిగే వాస్తవాలు తెలిశాయి. భార్యాపిల్లలను  హతమార్చి ఇంట్లోనే పాతిపెట్టిన దారుణానికి ఒడిగట్టింది స్వయానా  భర్తేనని పోలీసులకు తెలిసింది.  అంతేకాకుండా అతడు నిక్షేపంగా బతికే ఉన్నట్లు గుర్తించి షాక్ అయ్యారు.
యూపీలోని కార్గంజ్ జిల్లాకు చెందిన 34 ఏళ్ల రాకేశ్, నోయిడాలోని ఓ ల్యాబొరేటరీలో పనిచేస్తాడు. ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె మోజులో పడి 2018 ఫిబ్రవరిలో కట్టుకున్న
భార్యను.. రక్తం పంచుకొని పుట్టిన ఇద్దరు పిల్లలను హత్యచేసి ఇంట్లోనే
గొయ్యి తీసి పాతి పెట్టాడు. ఆ తర్వాత తనే పోలీసు స్టేషన్ కు వెళ్లి.. తనకు
చెప్పకుండా పిల్లలతో కలిసి భార్య ఎటో వెళ్లిపోయిందని ఫిర్యాదు
చేశాడు. పోలీసుల దృష్టిని మళ్లించి, కేసు శాశ్వతంగా మూతపడేలా
చేసేందుకు ప్రేయసితో కలిసి రాకేశ్ ఓ పథకం వేశాడు. రాకేశ్, ప్రేయసి
కలిసి ఊర్లోనే ఓ వ్యక్తిని హత్యచేశారు. మృతదేహం నుంచి చేతులను
వేరు చేసి, తలను కాల్చేశారు. మృతదేహానికి రాకేశ్ తన బట్టలను తొడి
గించి, జేబులో తనకు సంబంధించిన ఐడీ కార్డులను ఉంచాడు. దీంతో
రాకేశ్ హత్యకు గురైనట్లుగానే పోలీసులకు భావించారు. అయితే మృత
దేహం నుంచి నమూనాలను సేకరించి డీఎన్ఏ టెస్టుకు పంపారు.
మూడేళ్ల తర్వాత రిపోర్టు వచ్చింది. అందులో.. ఆ మృతదేహం రాకేశ్ ది
కాదని తేలిపోయింది. దీంతో పోలీసులు అతడి కోసం వెతకడం
ప్రారంభించారు. రాకేశ్ ప్రేయసితో కలిసి హరియాణాలో ఉంటున్నాడని..
దిలీప్ శర్మ పేరుతో చలామణి అవుతున్నాడని వెల్లడైంది. దర్యాప్తులో
ఇచ్చిన సమాచారం ఆధారంగా అతడి ఇంట్లో తవ్వి చూడగా.. భార్య,
పిల్లల అస్తిపంజర అవశేషాలు లభించాయి.

Leave a Reply