రాత్రంతా భార్య మృతదేహంతోనే!

0
237

భద్రాచలం: ఆర్టీసీ బస్టాండ్ లో దారుణం చోటు చేసుకుంది. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం ఒక మహిళ రాగా వైద్యం చేయక పోవడంతో భద్రాచలం ఆర్టిసి బస్టాండ్ లో మృతి చెందిన ఘటన సంచలనంగా అమరింది. కొత్తగూడెం ప్రాంతానికి చెందిన సమ్మయ్య భార్య రమ (60) ఆరోగ్యం బాగా లేక పోవడంతో శనివారం మూడు గంటలకు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. అక్కడి సిబ్బంది ఈ రోజు సమయం అయి పోయింది రేపు ఆదివారం సెలవు, సోమవారం రావాలని చెప్పడంతో చేసేది ఏమీ లేక సమ్మయ్య తన భార్యతో తిరుగు ప్రయాణం అయ్యాడు. భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ కి రాగానే బస్సు ఎక్కే క్రమంలో రమ మృతి చెందింది దీంతో బస్సు ఎక్కించుకునేదుకు ఆర్టీసీ సిబ్బంది నిరాకరించారు. దీంతో మృత దేహంతోనే సమ్మయ్య ఆర్టీసీ బస్టాండ్ లో రాత్రంతా పడిగాపులు కాచాడు వైద్య సిబ్బంది పట్టించుకోక పోవడం వల్లే తన భార్య మృతి చెందిందని సమ్మయ్య అంటున్నాడు.

Leave a Reply