Thursday, January 2, 2025

ఏసీబీకి చిక్కిన మరో అవినీతి చేప

లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన వాటర్ వర్క్స్ సీనియర్ అసిస్టెంట్

హైదరాబాద్: లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ మరో అవినీతి చేప ఏసీబీ అధికారులకు చిక్కింది. ఖైరతాబాద్ లోని హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డులో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఎల్. రాకేష్ శుక్రవారం మార్చి 15 మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తన కార్యాలయంలో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడానికి అక్బర్ హుస్సేన్ అనే ఫిర్యాదుదారుని వద్ద లంచం డిమాండ్ చేశాడు. ఏసీబీ అధికారులను బాధితుడు ఆశ్రయించగా వలపన్ని పట్టుకున్నారు. రాకేష్ తో పాటు లంచం డబ్బులు దాచి పెట్టడానికి యత్నించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సందీప్ ను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Related Articles

Latest Articles