Thursday, April 10, 2025

కేజ్రీవాల్‌ అరెస్టుకు నిరసనగా ర్యాలీ

హైద‌రాబాద్ మార్చ్ 22 నేరాలు-ఘోరాలు:
ఆమ్‌ఆద్మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అరెస్టుకు నిరసనగా హైదరాబాద్‌లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయం ఎదుట ఆమ్‌ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు మోడీ డౌన డౌన అంటూ నినాదాలు, మోడీకి వ్యతిరేకంగా ప్లకార్డులతో ర్యాలీ రూపంలో బీజేపీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు బ్యారికేడ్ల ద్వారా అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి పాల్పడిన కార్యకర్తలను బేగంబజార్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు. దీంతో కొద్ది సేపు అక్కడ ఉద్రిక్తత కనిపించింది.

Related Articles

Latest Articles