Tuesday, December 3, 2024

శేరిలింగంపల్లిలో భారీగా గంజాయి పట్టివేత

హైద‌రాబాద్ మార్చ్ 22 నేరాలు-ఘోరాలు: ఒడిషా నుంచి ఆంధ్ర మీదుగా నగరానికి గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఒడిషాకు చెందిన రాహుల్‌ కొంతకాలంగా అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. అతని వద్ద నుంచి 10 కేజీల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తీసుకొచ్చి నగరంలో విక్రమ్‌ అనే వ్యక్తికి అప్పగించే ప్రయత్నంలో అధికారులకు చిక్కాడు. చిన్న ప్యాకెట్లలో ప్యాక్‌ చేసి విక్రమ్‌ ద్వారా గచ్చిబౌలిలోని సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనల్స్‌కు, ఇంజనీరింగ్‌ విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు రాహుల్‌ వెల్లడించాడు. ఒడిషాకు చెందిన జగన్నాథ్‌ బిస్వా అనే వ్యక్తి వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసినట్లు పోలీసులకు చెప్పాడు. అతని మీద ఎనఈపీఎస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ని దర్యాప్తు ప్రారంభించారు…

Related Articles

Latest Articles