Thursday, November 21, 2024

బొల్లారం, మంఖాల్‌లో డ్ర‌గ్స్ త‌యారీ కేంద్రాలు

హైద‌రాబాద్ నగరంలో అక్రమంగా డ్రగ్స్‌ తయారీ కేంద్రాలపై ఔషధ నియంత్రణ సంస్థ (డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిసే్ట్రషన) దాడులు కొనసాగుతున్నాయి. ఒక్కరోజు ముందు సంగారెడ్డి జిల్లా, జిన్నారం మండలం, ఐడీఏ బొల్లారంలో ఉన్న పీఎస్‌ఎన మెడికేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో దాడులు నిర్వహించి రూ. 8.99కోట్లు విలువ చేసే అక్రమ డ్రగ్స్‌ సీజ్‌ చేసిన అధికారులు… తాజాగా అందిన సమాచారం మేరకు అదే వేగం కొనసాగించారు. తాజాగా తెలంగాణ ఎక్సైజ్‌ అధికారులతో కలిసి ఐడీఏ బొల్లారంలో మెడ్‌కెమ్‌ ల్యాబ్స్‌పై, ఐడీఏ మంఖాల్‌లో ఉన్న వనమాలి ఆర్గానిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలపై దాడులు చేపట్టారు. ఆయా కంపెనీల్లో వివిద కోడ్‌లతో అక్రమంగా డ్రగ్స్‌ తయారు చేసి నిల్వ ఉంచినట్లు గుర్తించారు. మెడ్‌కెమ్‌ ల్యాబ్స్‌లో రూ. 1.19 కోట్ల విలువ చేసే 2.850 కేజీల నిషేధిత ఆల్ఫా – పీఐహెచ్‌పీ అనే డ్రగ్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి మెడ్‌కెమ్‌ ల్యాబ్స్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ పెద్దోళ్ల శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. విచారించగా ఇక్కడ తయారు చేసి నెదర్లాండ్స్‌కు ఎగుమతి చేస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా మంఖాల్‌లోని వనమాలి ఆర్గానిక్స్‌లో దాడులు నిర్వహిచి వీఓఎల్‌007 అనే కోడ్‌తో ఉన్న మెథైల్‌మెథ్‌ కాథినోన (3-ఎంఎంసీ) అనే నిషేధిత డ్రగ్స్‌ను గుర్తించారు. అక్కడి నుంచి రూ. 1.15కోట్లు విలువ చేసే 11.5 కేజీల 3-ఎంఎంసీ స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ ప్రొడక్షన్ మేనేజర్‌ కెవి.రాజగోపాల్‌ను అరెస్టు చేశారు. విచారించగా ఇక్కడ తయారయ్యే డ్రగ్స్‌ను నెదర్లాండ్స్‌ ఇతర దేశాలకు సరఫరా చేసినట్లు వెల్లడించారు.

Related Articles

Latest Articles