హైదరాబాద్ మార్చ్ 24 నేరాలు-ఘోరాలు: వాహనంపై రూ. వెయ్యి చలానా పెండింగ్‌లో ఉన్నా… మరీ రోడ్డు మధ్యలో బండి ఆపి చలానా కట్టిందాకా వదలరు ట్రాఫిక్ పోలీసులు. అలాంటి నగరంలో… బాఽధ్యతాయుతమైన హోదాలో ఉన్న వ్యక్తి దర్జాగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వాడుతున్న కారు ‘డిఫెండర్’ (టీఎస్ 11ఈవీ 9922)పై రూ. 10,485 రూపాయల ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో అధికంగా ఓఅర్‌ఆర్ పై ఓవర్ స్పీడ్‌కు సంబంధించినవే. చలానాలు అన్ని ఉన్నా పోలీసులు పట్టించుకోకపోవడమేంటనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.