నేరం.. ఈ పదం ప్రతిరోజు వార్తా పత్రికలు, టీవీ ఛానళ్లలో ప్రముఖమైపోయింది. నేర వార్తలు మనందరి నిత్య జీవితంలో ఓ భాగమైపోయాయి.. వద్దనుకున్నా ఇవి మనతో విడదీయలేనంతగా పెనవేసుకుపోయాయి.. నేరవార్తలు ఆసక్తిని కల్గించడమే కాదు.. అప్రమత్తంగా ఉండేందుకూ దోహదపడతాయి. మోసాలమయమైన ఈ ప్రపంచంలో మనల్ని మనం రక్షించుకునేందుకు సహకరిస్తాయి. ఈ దిశగా ప్రజలను అప్రమత్తం చేయడం మా ఉద్దేశ్యం. క్షణికావేశంలో చేసిన తప్పిదంతో నేరస్తుడు జైల్లో శిక్ష అనుభవిస్తే.. అతడిపై ఆధారపడ్డ వారంతా సమాజంలో శిక్ష అనుభవిస్తారు. అలాంటి క్షణికావేశాన్ని దూరం చేయడం మా లక్ష్యం. నేరరహిత సమాజం మా ఆశయం. దీనికోసమే పాత్రికేయ రంగంలో విశేష అనుభవమున్న సీనియర్ పాత్రికేయులు కలిసి ఏర్పాటుచేసిందే నేరాలు ఘోరాలు డాట్ కాం. అనేక పత్రికలు, టీవీ ఛానళ్లు, లెక్కనేనన్ని వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్లు వార్తలను ఇస్తూ.. అందులో నేర సంబంధిత వార్తలను కూడా ఒక భాగంగా అందిస్తున్నాయి. కాని కేవలం నేర సంబంధిత వార్తలు, విశ్లేషణల కోసమే ప్రారంభిస్తున్న దేశంలోనే తొలి క్రైం న్యూస్ వెబ్సైట్ ఇదే అని చెప్తున్నందుకు గర్వపడుతున్నాం. ఈ వెబ్‌సైట్ ద్వారా మేము అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని, నేరమయమైన సమాజంలో ఓ మార్పునకు కారణమవుతామన్న ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్నాం. మా సుదీర్ఘ పాత్రికేయ అనుభవం, వాస్తవిక విశ్లేషణలు, సంచలనం కోసం కాకుండా నిజాలను వెలికి తీసేందుకు సాగే పరిశోధనలు అందరినీ ఆకట్టుకుంటాయని నమ్ముతున్నాం.
జై హింద్