Thursday, January 2, 2025

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌- రూ. 57.38లక్షల టోక‌రా

ఖాతాలు సమర్పించిన ఇద్దరు అరెస్టు

హైద‌రాబాద్ మార్చ్ 22 నేరాలు-ఘోరాలు: ఇప్పటి వరకు ఆన్‌లైన్‌ మోసాలంటూ భరతపూర్‌, 24పరగణ, బీహార్‌, రాజస్థాన, కోల్‌కతాల పేర్లు మాత్రమే వినిపించేవి. కానీ మేమూ తక్కువేమీ కాదని నగర వాసులు కూడా మోసాల దందాల్లో చేతులు తడుపుకుంటున్నారు. ఉప్పల్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు నేరుగా మోసాలకు పాల్పడనప్పటికీ… ఆన్‌లైన టేడింగ్‌ పేరిట సాగుతున్న ఘరానా మోసగాళ్లకు తమ ఖాతా వివరాలు ఇవ్వడం..ఖాతాల్లోకి వచ్చిన డబ్బును మోసగాళ్లకు ట్రాన్సఫర్‌ చేయడం లాంటి కార్యకలాపాలకు పాల్పడ్డారు. మోసపోయిన బాధితుల్లో నగరానికి చెందిన వ్యక్తి ఫిర్యాదుతో… ఖాతాలు సమర్పించుకున్న వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. నగర వాసికి రూ. 57.38 లక్షల టోకరా వేయడంలో సహకరించిన ఇద్దరినీ విచారిస్తే కోట్ల రూపాయల్లో మోసాలకు పాల్పడిన కింగ్‌పినలు వెలుగులోకి వచ్చే అవకాశముది. బాధితుల సంఖ్య కూడా పెరిగే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.
ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ ద్వారా బాగా డబ్బులు సంపాదించవచ్చని అమాయకులన మభ్యపెట్టి దోచుకుంటున్న వారికి సహకరించిన ఇద్దరు మోసగాళ్లను హైదరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నగరానికి చెందిన ఓ వ్యక్తి ట్రేడింగ్‌ ఫ్రాడ్‌ ద్వారా మోసపోయినట్లు గత ఫిబ్రవరిలో సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించాడు. గోల్డ్‌మాన్‌ (ఇండియా) అనే వాట్సాప్‌ గ్రూప్‌లో అతన్ని చేర్చి ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో అధిక లాభాలు వస్తాయంటూ లింకులు పంపించారు. నమ్మిన బాధితుడు వారు చెప్పినట్లు లింకుల ద్వారా యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకుని అందులో పెట్టుబడులు పెట్టాడు. నమ్మకం పెంచడానికి తొలుత తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టమని సలహా ఇచ్చిన మోసగాళ్లు.. క్రమంగా అతన్ని ఆశ చూపుతూ పెట్టుబడులు పెంచారు. ఇలా క్రమంగా పెంచుకుంటూ ఆన్‌లైన్‌లో డబ్బులు ట్రాన్సఫర్‌ చేసిన బాధితుడు మొత్తం రూ. 57.38 లక్షలు సమర్పించుకున్నాడు. తీరా మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ట్రాన్సఫర్‌ అయిన ఖాతాలు.. వాటికి సంబంధించిన ఆపరేషన్స్‌ ద్వారా కూపీ లాగారు. బాధితుడి డబ్బులు ట్రాన్సఫర్‌ అయిన ఖాతాల వివరాలు సేకరించిన పోలీసులు ఉప్పల్‌ నివాసులైన తమనం సురేంద్ర, నరేశబాబులను అరెస్టు చేశారు. వారిని విచారించగా ఢిల్లీకి చెందిన రాజ్‌ఠాకూర్‌ను కలిశామని… అతని ఆదేశాల మేరకే.. కమీషన్ల కోసం ఖాతాలు సమర్పించామని చెప్పారు. గత మూడు నెలల్లో 8ఖాతాల ద్వారా రూ. 5కోట్ల లావాదేవీలు జరిపినట్లు ఇద్దరు నిందితుల ఖాతాల నుంచి పోలీసులు సమాచారం సేకరించారు. నిందితులిద్దరు ఇచ్చిన సమాచారం మేరకు ఢిల్లీకి చెందిన రాజ్‌ఠాకూర్‌, టెలిగ్రామ్‌, వాట్సాప్‌ గ్రూపుల్లో యాడ్‌ చేసిన నెల్లూరు వాసి భరత దాసినేనిల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారి వద్ద నుంచి ల్యాప్‌టాప్‌, మూడు ఫోనలు, ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.

Related Articles

Latest Articles