ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సంచలనం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కవితకు అరెస్ట్ వారెంట్ ఇచ్చిన అధికారులు.. ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసి అరెస్ట్ చేశారు. అయితే.. మధ్యాహ్నం నుంచి సుమారు 5 గంటల పాటు ఆమె నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు ఆమె ఫోన్లను సీజ్ చేసినట్టు సమాచారం. పీఎం నరేంద్ర మోదీ.. హైదరాబాద్‌లో ఉన్న సమయంలోనే కవితను అరెస్ట్ చేయటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
