తాజాగా అరెస్టు అయిన ఇద్దరు అదనపు ఎస్పీలు సైతం చంచల్‌గూడ జైలుకు
విదేశాలకు వెళ్లిపోయిన ఇద్దరు సీనియర్ అధికారుల కోసం ఎల్‌ఓసి

హైదరాబాద్ మార్చ్ 24 నేరాలు-ఘోరాలు: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ డిఎస్పీ ప్రణీత్ రావ్ వారం రోజుల కస్టడీ ముగియడంతో ఆయనను అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. అంతకు ముందు ఆయనకు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అధికారులు జైలుకు చేరవేశారు. ఆయనతో పాటు ఇదే కేసులో శనివారం అరెస్టు అయిన అదనపు ఎస్పీలు భుజంగరావు. తిరుపతన్నలను కూడా అధికారులు చంచల్ గూడ జైలుకు తరలించారు. వారికి ఏప్రిల్ 6 వరకు కోర్టు రిమాండ్ విధించింది. గతలో అరెస్టు అయిన ప్రణీతరావును ఈ నెల 17 నుంచి వారం రోజుల పాటు పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించిన విషయం తెలిసిందే. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు పలువురు అధికారుల పేర్లు బయటకు రావడంతో కేసులు మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే పోలీస్ శాఖకు చెందిన ముగ్గురు సీనియర్ అధికారులు అరెస్టయి చంచల్‌గూడ జైలుకు చేరుకున్నారు. తాజాగా జాబితాలో ఇద్దరు సీనియర్ అధికారులు ప్రభాకర్‌రావు, రాధాకిషనరావుల పేర్లు కూడా చేరడంతో కేసులో ట్విస్ట్ పెరిగింది. కొనసాగుతున్న విచారణ తీరు చూస్తుంటే ఈ వ్యవహారంలో అధికారుల సంఖ్య పెరగడంతో పాటు.. ఫోన ట్యాపింగ్‌తో లబ్ధి పొందిన వారు, ఆదేశాలిచ్చిన వారి పేర్లు కూడా జాబితాలో చేరే అవకాశముంది.
ప్రణీతరావు ఫోన ట్యాపింగ్ వ్యవహారంలో మరో ఇద్దరు సీనియర్ అధికారులు ప్రభాకర్‌రావు, రాధాకిషనరావుల పేర్లను పోలీసులు చేర్చారు.
ప్రణీత రావు ఫోన్ టాపింగ్ లో ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావులే కీలకంగా వ్యవహరించారని అధికారులు గుర్తించారు. ప్రభాకర్ రావు, రాధా కిషన్‌రావులు చెబితేనే ఫోన ట్యాపింగ్ చేసినట్లు ప్రణీతరావు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ట్యాపింగ్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభాకర్ రావుకు అందించినట్లు పోలీసులు గుర్తించారు. రాజకీయ నాయకులు, వ్యాపారుల ఫోన్ నెంబర్లను ప్రభాకర్ రావు, ,రాధా కిషన్ రావులే ప్రణీతరావుకిచ్చినట్లు గుర్తించారు. అప్పట్లో రేవంత్ రెడ్డి పై పూర్తిస్థాయిలో నిఘా పెట్టాలని ప్రభాకర్ రావు ఆదేశించారు. అంతే కాకుండా రేవంత్ రెడ్డి, కుటుంబ సభ్యులు, అనుచరులు, అతని మిత్రుల ఫోన్లను కూడా ప్రభాకర్‌రావు ట్యాప్ చేయించారు. ట్యాపింగ్ అనంతరం రేవంత్ రెడ్డి సంబంధించిన ప్రతి సమాచారాన్ని ప్రభాకర్‌రావుకు ప్రణీతరావు చేరవేశారు. దాంతో పోలీసులు
ప్రభాకర్ రావు ,రాధా కిషన్ రావులను కూడా పంజాగుట్ట పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. వారిద్దరూ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.