Tuesday, February 18, 2025

ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్ కౌంట‌ర్‌

ఛత్తీస్‌గడ్‌ మార్చ్ 17 నేరాలు – ఘోరాలు:
ఛత్తీస్‌గడ్‌ బీజాపూర్ జిల్లాలో ఆదివారం మావోయిస్టులకు, పోలీసులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది… ఈ ఎన్‌కౌంటర్‌లో ఇంద్రావతి ఏరియా కమిటీ కమాండర్ మల్లేష్, మాద్ డివిజన్ కమిటీ కంపెనీ కమాండర్ అరుణ్ అలియాస్ రూపేష్ మృతి చెందారు.
హెగ్మటా అటవీ ప్రాంతంలో 20 నుంచి 25 మంది మావోయిస్టులు సమావేశం అయినట్టు భద్రతాబల గాల కు సమాచారం అందింది. దీంతో సర్చ్ ఆపరేషన్ చేపట్టిన భద్రతాబలగాలు డీఆర్‌జీ పోలీసులు కూంబిం గ్ నిర్వహించారు.
ఈ కూంబింగ్‌లో మావోయి స్టులు ఎదురుపడటంతో ఎన్‌కౌంటర్ జరిగింది. కాగా.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఆఫీ సర్లు చనిపోగా.. మరికొందరు గాయపడ్డట్టు పోలీసులు ప్రకటనలో తెలిపారు.

Related Articles

Latest Articles