Thursday, January 2, 2025

పెళ్లిచూపులకు వెళ్తుండగా యాక్సిడెంట్‌

ఒకే కుటుంబానికి చెందిన‌ ఆరుగురు మృతి

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మార్చ్ 18 నేరాలు-ఘోరాలు: ఉత్తర్ ప్రదేశ్‌లో గ‌త‌ ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జాన్‌పూర్ వద్ద కారును ట్రక్కు ఢీకొట్టిన ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. గౌరబాద్‌షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జౌన్‌పూర్-అజంగఢ్ హైవేపై ప్రసాద్ కెరకట్ కూడలి సమీపంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బిహార్‌లోని సీతామర్హి‌కి చెందిన ఓ కుటుంబం ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తొమ్మిది మంది కారులో వెళ్తుండగా జౌన్‌పూర్‌ నుంచి కెరకట్‌ వైపు మలుపు తిరిగిన వెంటనే ఎదురుగా వేగంగా వస్తున్న ఓ ట్రక్కు ఢీకొంది. పోలీస్ సర్కిల్ పరిధిలోని ప్రసాద్ కాలేజీ సమీపంలో జరిగిన ఈ ఘటనలో కారులోని వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్ర‌మాద వార్త విన్న ఆ రెండు కుటుంబాల్లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని బాధితులను కాపాడే ప్రయత్నం చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వాహనంలోని నుంచి బయటకు తీశారు. అయితే, అప్పటికే తీవ్ర గాయాలతో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. క్షతగాత్రులను జాన్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Related Articles

Latest Articles