Thursday, January 2, 2025

పోలీస్ కస్టడీకి ప్రణీత్ రావు

ప్రారంభమైన విచారణ

హైదరాబాద్ మార్చ్ 17 నేరాలు – ఘోరాలు: చంచల్ గూడ జైలు లో రిమాండ్ లో ఉన్న డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావును ఆదివారం పంజాగుట్ట పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో గత బుధవారం పోలీసులు అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ప్రణీత్ రావ్ నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులకు నాంపల్లి కోర్ట్ ఏడు రోజుల కస్టడీకి శనివారం అనుమతించింది. ఈ మేరకు ఆదివారం ఉదయం పంజాగుట్ట పోలీసులు జైలు నుంచి అతన్ని అదుపులోకి తీసుకొని తరలించారు.ఈ విచారణలో కీలక విషయాలు రాబట్టేందుకు పోలీసులు ఆధారాలు. సేకరించినట్లు సమాచారం. ఈ వ్యవహారం లో పోలీసు ఉన్నతాధికారుల పాత్రపై ప్రశ్నించనున్నారని తెలిసింది. ప్రజా ప్రతినిధులు.. అధికారులు.. వారి కుటుంబ సభ్యులు మీడియా.. రియల్ ఎస్టేట్ పెద్దల ఫోన్లను వాట్సాప్ మెసేజ్ లపై టాపింగ్ చేసి ఎవరికి సమాచారం ఇచ్చారు.ఎందుకు చేయాల్సి వచ్చింది .సెల్ ఫోన్లు, హార్డ్ డిస్క్లు, వేల సంఖ్యలో పత్రాలను ధ్వంసం చేసిన ఘటనపై వివరాలు సేకరించనున్నారని సమాచారం.

Related Articles

Latest Articles