వారం రోజుల పాటు విచారించనున్న అధికారులు
హైదరాబాద్: మార్చ్ 17 నేరాలు-ఘోరాలు: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబి) మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును నేడు పంజాగుట్ట పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఆయనను 7రోజుల కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. ఫోన్ ట్యాపింగ్, ఇతర చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడిన ఆరోపణలపై తదుపరి విచారణ నిమిత్తం ప్రణీత్ రావును కస్టడీకి ఇవ్వాలని పంజాగుట్ట పోలీసులు పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు అనుమతించింది. సస్పెన్షన్‌లో ఉన్న డీఎస్పీ ప్రణీత్‌రావుకు వివిద అంశాలపై అధికారులు విచారించనున్నారు. ఎస్‌ఐబీ కార్యాలయంలో ఫోన్ ట్యాపింగ్, పరికరాలను ధ్వంసం చేసిన తీరు… వాటి వెనక ఉన్న వారి పేర్ల గురించి ఆరా, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతలతో పాటు ఈ వ్యవహారంలో కొందరు సీనియర్ పోలీసు అధికారుల పేర్లు బయటపడ్డాయి. విచారణ వారం రోజుల పాటు సాగనుంది.