Friday, January 3, 2025

సింగర్ మంగ్లీకీ త్రుటిలో తప్పిన ప్రమాదం

ఆమె కారును వెనుక మంచి ఢీ కొట్టిన డిసిఎం

హైదరాబాద్ మార్చ్ 18 నేరాలు – ఘోరాలు: సింగ‌ర్ మంగ్లీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఆమెతో పాటు కారులో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రికి స్వ‌ల్ప గాయాల‌ య్యాయి.
హైదరాబాద్,బెంగళూరు జాతీయ రహదారిపై తొండుపల్లి వంతెన వద్ద ఆదివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగిందని శంషాబాద్ పోలీసులు తెలిపారు.
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనం లో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ హాజరయ్యారు. అదేరోజు అర్ధరాత్రి తర్వాత మరో ఇద్దరితో కలిసి ఆమె కారులో తిరుగు ప్రయాణం అయ్యారు..
హైదరాబాద్‌-బెంగళూర్‌ జాతీయ రహదారి మీదుగా ఇంటికి బయల్దేరారు. శంషాబాద్‌ మండలం తొండుపల్లి వంతెన వద్దకు రాగానే.. కర్ణాటకకు చెందిన ఓ డీసీఎం వెనక నుంచి వేగంగా వచ్చి కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాల య్యాయి. ప్రమాదంలో కారు వెనక భాగం పూర్తిగా దెబ్బతింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది

Related Articles

Latest Articles