Friday, April 4, 2025

కరుణానిధి, కేసీఆర్ గారాల కుమార్తెలు కనిమొళి – కవిత..

అరెస్టులో సారూప్యతలు

డీఎంకే వ్యవస్థాపకుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఏకైక కుమార్తె కనిమొళి 2జి స్కామ్ కేసులో 2011లో చెన్నైలోని ఆమె నివాసంలో ఈడి అరెస్టు చేసిన విషయం తెలిసింది. లిక్కర్ స్కామ్ కేసులో టిఆర్ఎస్ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకైక కుమార్తె కవితను ఈడి హైదరాబాద్లోని ఆమె నివాసంలో అరెస్టు చేసింది. ఇద్దరి అరెస్టు విషయంలో అనేక సారూప్యతలు కనిపిస్తున్నాయి. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రి ఏకైక కుమార్తెలు. ఇద్దరూ పరోక్ష ఎన్నిక ద్వారా పెద్దల సభకు ఎన్నికైన వారు. అరెస్టు సమయంలో కనిమొళి రాజ్యసభకు, కవిత శాసనమండలికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మే నెల 2011లో అరెస్టు అయిన కనిమొళి ఆరు నెలల కారాగార జీవితం అనంతరం ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి బెయిలుపై విడుదలయ్యారు. కవిత ఎన్ని రోజులు జైల్లో ఉంటారో..?

Related Articles

Latest Articles