Monday, December 2, 2024

కారు చక్రాల కింద పడి 9నెలల చిన్నారి మృతి

హైద‌రాబాద్ మార్చ్ 22 నేరాలు-ఘోరాలు: అత్తాపూర్‌ పోలీస్‌ ేస్టషన్‌ పరిధి అక్బర్‌ హిల్స్‌ లోని సుల్తాన్‌ అపార్ట్మెంట్‌ వద్ద శుక్రవారం ఓ కారు రివర్స్‌ తీసుకుంటుండగా తొమ్మిది నెలల పాప కారు కింద వచ్చి అక్కడికక్కడే మృతి చెందింది. అదే అపార్టుమెంట్‌లో వాచమనగా పని చేస్తున్న శ్రీను కుమార్తె (9 నెలలు) రోడ్డుపై ఆడుకుంటుండగా… అయాజ్‌ అహ్మద్‌ అనే వ్యక్తి కారును రివర్స్‌ తీసుకున్నాడు. అదే సమయంలో చిన్నారి కారు వెనుక చక్రాల కింద వచ్చి తీవ్ర గాయాలయి అక్కడికక్కడే మృతి చెందింది. గమనించిన తల్లిదండ్రులు హుటా హుటినా పాపను దగ్గరలో ఉన్న ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా చిన్నారి మృతి చెందినట్లుగా వైద్యులు నిర్థారించారు. సమాచారం అందుకున్న అత్తాపూర్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు…

Related Articles

Latest Articles