బెలూన్లు ఓపెన్ కావడంతో తప్పిన ప్రమాదం
హైదరాబాద్ శివారు తట్టి అన్నారం వద్ద కారు ప్రమాదానికి గురైంది. కారులో నలుగురు ఉన్నప్పటికీ ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. తట్టి అన్నారం నుంచి గౌరెల్లి వైపుకు వెళుతున్న బీఎండబ్ల్యూ కారు కుత్బుల్లాపూర్ రోడ్డు మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఆ సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు తెలిసింది. కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.