Tuesday, January 28, 2025

డీజిల్ బ్లాక్ మార్కెట్‌- అక్ర‌మ త‌ర‌లింపు

రూ. 14.36 లక్షల విలువ చేసే 15 వేల లీటర్ల డీజిల్‌ స్వాధీనం

హైద‌రాబాద్ మార్చ్ 24 నేరాలు-ఘోరాలు: క‌ర్ణాట‌క నుంచి నగరానికి అక్రమంగా డీజిల్‌ తరలించి విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్‌ ఎస్‌ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. గచ్చిబౌలి శంకర్‌ హిల్‌ ప్రాంతంలో డీజిల్‌ మార్పిడి జరుగుతోందని తెలసుకున్న సైబరాబాద్‌, శంషాబాద్‌ ఎస్‌ఓటి బృందాలు అక్కడికి చేరుకున్నాయి. కొందరు వ్యక్తులు అక్కడ డీజిల్‌కు సంబంధించిన పెద్ద టాంకర్‌ నుండి చిన్న టాంకర్‌ల లోకి డీజిల్‌ నీ మార్చుతుండగా పట్టుకున్నారు. వారిని విచారించగా డీజిల్‌ ను కర్ణాటకలోని చొంచోలి నుండి హైదరాబాద్‌ తరలించి తక్కువ రేట్‌ కు అమ్ముతున్నాట్లు వెల్లడైంది. కర్ణాటక లోని చించోలిలో రూ. 85.75 లకు లీటర్‌ చొప్పున కొని హైదరాబాద్‌ లోని పెట్రోల్‌ బంక్‌లలోని దరకంటే తక్కువ ధరకు లోకల్‌ బ్రోకర్‌ లకు అమ్ముతునట్లు వెల్లడింఆచారు. కర్ణాటక లో డీజిల్‌ లీటర్‌ ధర రూ 85.75. కాగా తెలంగాణా లో డీజిల్‌ ధర 97.75 ఉంది. స్థానిక దళారులు స్మగ్లర్ల నుంచి డీజిల్‌ కొనుగోలు చేసి క్రషర్‌ యజమానులు, ఇసుక లారీ యజమానులకు రూ. 92 నుండి 94 వరకు లీటర్‌ చొప్పున బిల్లులు లేకుండా విక్రయిస్తున్నారు. కర్ణాటక నుంచి వచ్చిన డీజిల్‌ ట్యాంకర్‌ (టీఎస్‌12 యూఏ 4491)ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు డ్రైవర్లు చించోలికి చెందిన సద్దామ్‌ (29), సంగారెడ్డి, జోగిపేట నివాసి మిర్జా ఇస్మాయిల్‌ బేగ్‌ (35)లను అదుపులోకి తీసుకున్నారు. ట్యాంకర్‌ యజమాని సయ్యద్‌ గౌస్‌ పరారీలో ఉన్నాడు. స్థానిక ట్యాంకర్‌ (నెంబర్‌ టీఎస్‌07 యూపీ 1958)ను స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ బీదర్‌కు చెందిన శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ట్యాంకర్‌ యజమాని రాధాకృష్ణ పరారీలో ఉన్నాడు. మరోట్యాంకర్‌ (టీఎస్‌ 09 యూడీ 6877)ను స్వాధీనం చేసుకుని మెదక్‌కు చెందిన డ్రైవర్‌ సంతోష్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ట్యాంకర్‌ యజమాని నరేశగౌడ్‌ పరారీలో ఉన్నాడు. మరో ట్యాంకర్‌ (టీఎస్‌07 యూఎం 7858)ను స్వాధీనం చేసుకుని టేక్మాల్‌కు చెందిన డ్రైవర్‌ పాకిరి ఇస్మాయిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ట్యాంకర్‌ యజమాని రామకృష్ణ పరారీలో ఉన్నాడు. మరో వ్యక్తి జహీరాబాద్‌కు చెదిన సిద్దప్పను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మొత్తం నాలుగు ట్యాంకర్లను సీజ్‌ చేశారు. నలుగురు డ్రైవర్లతో పాటు ఆరుగురు అరెస్టు అయ్యారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు.

Related Articles

Latest Articles