Thursday, November 21, 2024

వాషింగ్ట‌న్‌లో హైదరాబాద్‌ వాసీ కిడ్నాప్‌?

కిడ్నాపర్ల నుంచి ఫోన కాల్‌.. ఫోన నెంబర్‌ ఆధారంగా దర్యాప్తు

వాషింగ్ట‌న్‌ మార్చి 20 నేరాలు-ఘోరాలు: అమెరికాలో నివాసముంటున్న తన కుమారుడు రెండు వారాల నుంచి అదృశ్యమయ్యాడని… అతని ఆచూకీ కనిపెట్టాలంటూ అతని తండి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నాచారం ప్రాంతానికి చెందిన మహమ్మద్‌ అబ్దుల్‌ అర్ఫాత (పాస్‌పోర్టు నెంబర్‌ యూ-9815651) క్లీవ్‌లాండ్‌ యూనివర్సిటీలో మాస్టర్స్‌ డిగ్రీ చేయడానికి గతేడాది మే నెలలో బయలేదేరాడు. అప్పటి నుంచి కుటుంబీకులతో కాంటాక్ట్‌లో ఉన్న అర్ఫాత ఈ నెల 7న చివరి సారిగా ఆయన తండ్రి మహమ్మద్‌ సలీంతో మాట్లాడాడు. ఆ తర్వాత అతని ఫోన స్విచాఫ్‌ కావడమే కాకుండా అతని ఆచూకీ తెలియడం లేదని కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు రెండు రోజుల క్రితం అమెరికాకు చెందిన ఓ ఫోన నెంబర్‌నుంచి ఆయన తండ్రికి ఫోన వచ్చింది. వారి కుమారుడు క్షేమంగా దక్కాలంటే 1200 డాలర్లు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అయితే ఎలా చెల్లించాలనే విషయాన్ని వారు చెప్పలేదు. వెంటనే ఆయన తండ్రి వాషింగ్టన పోలీసులకు ఆ ఫోన నెంబర్‌ను చేరవేశారు. అర్ఫాత కోసం లుక్‌అవుట్‌ నోటీస్‌ జారీ చేసిన వాషింగ్టన పోలీసులు.. ఫోన నెంబర్‌ ఆధారంగా అతని కోసం గాలిస్తున్నారని కుటుంబీకులు చెప్పారు. అతనెక్కడ ఉన్నాడనే విషయంలో ఆచూకీ గుర్తించడానికి సహకరించాలంటూ ఎంబీటీ నేత అంజదుల్లాఖాన సాయంతో విదేశాంగ శాఖను కోరారు. అతని ఫోన కాల్‌ కోసం కుటుంబీకులు ఎదురు చూస్తున్నారు.

Related Articles

Latest Articles