బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ
మార్చ్ 18 నేరాలు – ఘోరాలు: ముక్తార్ అన్సారీ కుమారుడు అబ్బాస్ అన్సారీకి పెద్ద ఊరట లభించింది.. కొన్ని నెలలుగా జైల్లో ఉన్న ఆయనకు ఆయుధాల లైసెన్స్ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ ముఖ్తార్ అన్సారీ కుమారుడు అబ్బాస్ అన్సారీకి సుప్రీంకోర్టు ఊరట నిచ్చింది. ఆయుధాల లైసెన్స్ కేసులో అబ్బాస్ అన్సారీకి బెయిల్ మంజూరైంది. షూటింగ్ పోటీల సాకుతో విదేశీ తుపాకులు కొనుగోలు చేసినందుకు అబ్బాస్ అన్సారీపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఏడాది జనవరిలో, బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నోటీసు జారీ చేస్తూ యుపి ప్రభుత్వాన్ని సమాధానం కోరింది. నవంబర్ 2023 నెలలో అబ్బాస్ అన్సారీ జారీ చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. సోమవారం బెయిల్ మంజూరు అయింది.