Thursday, January 2, 2025

కాటేదాన్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ సమీపంలో మహిళ హత్య

హసన్‌ నగర్‌ కు చెందిన సమీరా ఖాన్‌ గా గుర్తింపు

హైద‌రాబాద్‌, మార్చ్ 29 నేరాలు-ఘోరాలు: కాటేదాన్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ వద్ద ఓ మహిళ హత్యకు గురైనట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరి వివరాలు సేకరించారు. సుమారు 25 సంవత్సరాల వయస్సున్న మహిళ తలపై బండరాయితో మోది దారుణంగా హత్య చేసినట్లు నిర్ధారించారు. తొలుత గుర్తు తెలియని మహిళ హత్యగా భావించిన పోలీసులకు తర్వాత ఆమె వివరాలు తెలిశాయి. మైలార్‌దేవ్‌ పల్లి పోలీస్‌స్టేషన పరిధిలో కలకలం రేపిన ఈ హత్యకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గురువారం రాత్రే ఆమెను ఎవరో హతమార్చి ఉంటారని భావిస్తున్నారు. శుక్రవారం తెల్లవారు జామున మార్నింగ్‌ వాక్‌కు వచ్చిన స్థానికులు ఓ మహిళ మృతదేహం పడి ఉందన్న విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు. మైలార్‌ దేవ్‌ పల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు ేసకరించారు. రాజేంద్రనగర్‌ ఏసీపీ టి. శ్రీనివాస్‌ కు సమాచారం ఇవ్వగా ఆయన సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలు హసన్‌ నగర్‌ కు చెందిన సమీరా ఖాన్‌ గా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. వివాహేతర సంబంధమే హత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెను హతమార్చిన నిందితుడు పోలీస్‌ ేస్టషన్‌ లో లొంగిపోయినట్లు సమాచారం.

Related Articles

Latest Articles