షాది.కామ్‌లో ప్రొఫైల్ పెట్టి మోసం చేసిన మోసగాడు అరెస్టు
మాట్రిమోని వెబ్‌సైట్లలో తప్పుడు వివరాలు పెట్టి… అమాయక యువతులు, మహిళలను మోసం చేస్తున్న ఘరానా మోసగాణ్ని సైబరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ జిల్లా, పోరంకి మండలం, పెనమలూరు గ్రామానికి చెందిన పొట్లూరి శ్రీబాల వంశీకృష్ణ (37) నిరుద్యోగిగా ఉంటూ విలాసాలకు అలవాటు పడ్డాడు. అడ్డదారిలో డబ్బులు సంపాదించడానికి మాట్రిమోని సైట్లను ఎంచుకున్నాడు. తనకు పెళ్లి కాలేదని చెబుతూ… నకిలీ ప్రొఫైల్స్ పోస్ట్ చేస్తాడు. తర్వాత ఎవరైనా యువతి యాక్సెప్ట్ చేస్తే.. తాను పెద్ద కంపెనీలో పని చేస్తున్నానని.. అమెరికా నుంచి ఆఫర్లు ఉన్నాయని బురిడీ కొట్టిస్తుంటాడు. పెళ్లి తర్వాత ఆమెను కూడా తీసుకెళ్తానని మాయమాటలు చెప్పి.. వీసా ప్రక్రియ.. ఇతరత్రా ఖర్చులు చెల్లించడానికి కాస్త డబ్బు అవసరం అంటూ డబ్బులు అడుగుతుంటాడు. అలా కొంత.. కొంత అంటూ రూ. లక్షల్లో గుంజుతాడు. ఇలా వందల సంఖ్యలో యువతుల వద్ద నుంచి రూ. కోట్లలో దండుకున్నాడు. ఇదే తరహాలో మోసపోయిన మదీనాగూడకు చెందిన ఓ మహిళ (30) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గతేడాది నవంబర్‌లో షాది.కామ్ ద్వారా యూఎస్ సిటిజన రిషి కుమార్ అనే ప్రొఫైల్ నచ్చడంతో తాను తన వివరాలు పోస్టు చేశానని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత వాట్సాప్ చాటింగ్ ద్వారా సాగిన సంభాషణలో గ్లెనమార్క్ ఫార్మాలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నానని ఆమెకు చెప్పి మోసాలకు తెరలేపాడు. ఆమెను యూఎస్‌కు రప్పిస్తానని చెప్పి.. దానికోసం సిబిల్ స్కోర్ పెంచాలని చెప్పాడు. ఆమె స్కోర్ 743 మాత్రమే ఉందని.. యూఎస్ వీసా రావాలంటే కనీసం 845 ఉండాలని మభ్యపెట్టాడు. దానికోసం వ్యక్తిగత రుణాలు తీసుకోవాలని ఆమెను ఉసిగొల్పి… ఆమెతో పాటు ఆమె వరసకు సోదరిని కూడా లోన్స వ్యవహారంలో వాడుకుని వారి పేరిట మొత్తం రూ. 2.71కోట్లు రుణం తీసుకున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆఽధారాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు. విచారించగా…
అసలు పేరు వంశీ కృష్ణగా చెప్పిన నిందితుడు ఆనలైన బెట్టింగ్, గుర్రపు పందాలకు బానిసగా మారి డబ్బులు ఆనలైనలో పెట్టడం అలవాటు చేసుకున్నాడు. దానికోసం డబ్బులు లేకపోవడంతో రూ. 2500 చెల్లించి షాది.కామ్‌లో మెంబర్ షిప్ తీసుకున్నాడు. అమాయకులకు ప్రొఫైల్స్ పంపించగా ఆరుగురు అతన్ని యాక్సెప్ట్ చేశారు. వారికి యూఎస్ వీసా మాయ చూపి డబ్బులు కాజేశాడు. అయితే బాధితురాలి వద్ద నుంచి 2.71కోట్లు స్వాహా చేసినప్పటికీ.. ఇప్పటి వరకు అతను ఇతర బాధితుల వద్ద నుంచి రూ. 10కోట్లకు పైగానే కాజేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అతనిపై 2011 నుంచే అతనిపై కేసులున్నాయని… హైదరాబాద్‌లో-1, చైతన్యపురిలో-1, సైబరాబాద్‌సీసీపీఎస్‌లో -2, విజయవాడ పటమట పీఎస్‌లో-1, సైబరాబాద్ నార్సింగ్‌పీఎస్‌లో-1, రామగుండం వనటౌనలో-1, హైదరాబాద్ సీసీపీఎస్‌లో-1, చెన్నయ్ తంబారాం పీఎస్‌లో-1. మొత్తం 9కేసులు నమోదై ఉన్నాయి.