హైదరాబాద్, మార్చ్ 29 నేరాలు-ఘోరాలు: చంచల్ గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న అడిషనల్ ఎస్పీ భుజంగరావు, డిఎస్పీ తిరుపతన్నలను పంజాగుట్ట పోలీసులు ఈ రోజు ఉదయం కస్టడీకి తీసుకున్నారు. వారిని 5రోజుల పాటు కస్టడీకి అనుమతినిస్తూ నాంపల్లి కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. దీంతో వారిద్దరినీ శుక్రవారం నుంచి మంగళవారం వరకు పంజాగుట్ట పోలీసులు విచారించనున్నారు. అయితే ఇదే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రణీత్ రావును మరోసారి కస్టడీకి అనుమతినివ్వాలంటూ పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్‌డీ రాధాకిషనరావు, డీఎస్పీ గట్టుమల్లు కూడా అరెస్టు కావడంతో ఫోనట్యాపింగ్ కుంభకోణంలో అరెస్టు అయిన వారి సంఖ్య 5కు చేరింది.